Breaking : పీఎస్ఆర్ పై మరో కేసు నమోదు

సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై మరో కేసు నమోదయింది.

Update: 2025-04-29 03:53 GMT

సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై మరో కేసు నమోదయింది. తాజాగా ఏపీపీఎస్సీగ్రూప్ 1 వ్యాల్యుయేషన్ లో అవకతవకలు, నిధులు దుర్వినియోగంపై మరో కేసు నమోదయింది. పీఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలో ఈ అవకతవకలు జరిగినట్లు పోలీసుల ఈ కేసు నమోదు చేశారు.

వరస కేసులు...
ఇప్పటికే పీఎస్ఆర్ ఆంజనేయులు పైన మూడు కేసులు నమోదయ్యాయి. ముంబయి నటి వేధింపుల కేసులో ఇప్పటికే అరెస్టయి ఆయన బెజవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు కూడా నమోదయింది. తాజాగా ఏపీపీఎస్సీ అవకతవకల కేసును కూడా నమోదయినట్లయింది. ఈరోజు కూడా పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు విచారించనున్నారు. మరొకవైపు నేడు పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పై విచారణ జరగనుంది.


Tags:    

Similar News