ఏపీ-తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరిగితే

హెడ్ లైన్ చూసిన ఏమైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందా అని టెన్షన్ పడకండి..

Update: 2023-07-31 11:37 GMT

హెడ్ లైన్ చూసిన ఏమైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందా అని టెన్షన్ పడకండి.. అలాంటిదేమీ జరగలేదు. ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సంస్థలు ఒపీనియన్ పోల్ నిర్వహించాయి. ఈ సర్వేలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి లాభమో తెలిపారు. ఏపీలో అధికార వైసీపీ, తెలంగాణలో అధికార బీఆర్ఎస్ లే ఆధిక్యంలో ఉంటాయని తేలింది. అయితే కొన్ని సీట్లు కోల్పోవడం మాత్రం పక్కా అని అంటున్నారు.

ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాలలో వైసీపీ 18 సీట్లను గెలుచుకుంటుందని తెలిపింది. గతంలో 22 సీట్లను గెలుచుకున్న వైసీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే 4 సీట్లను కోల్పోతుందని చెప్పింది. గత లోక్ సభ ఎన్నికల్లో కేవలం 3 సీట్లను మాత్రమే గెలుచుకున్న టీడీపీ... మరో 4 స్థానాలను కైవసం చేసుకుని 7 స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలను గెలుచుకుంటుందని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. బీజేపీ ఆధిక్యతను పెంచుకోబోతోందని, కాషాయం పార్టీకి 6 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ రెండు, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని తెలిపింది. సర్వే ప్రకారం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కో సీటును కోల్పోనున్నాయి. బీజేపీ 2 సీట్లను పెంచుకోనుంది. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు ఆయా పార్టీలకు కీలకం కానున్నాయి.


Tags:    

Similar News