Pawan Kalyan : నేడు పశ్చిమ గోదావరి జిల్లాకు పవన్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లాకు రానున్నారు
Pawan Kalyan
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లాకు రానున్నారు. ఆయన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో ఈ ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటుంటే, ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఉచిత గ్యాస్ పంపిణీ...
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాధపురం మహిళలకు దీపం-2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలెండర్లు పంపిణీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున అభిమానులు తరలి రానున్నారు.