Andhra Pradesh : ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.

Update: 2025-04-17 03:28 GMT

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. త్వరలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ విడుదల చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

తేదీల విడుదల...
ఈ పరీక్షల కోసం ఈ నెల 28వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి12 గంటల వరకు పేపర్-1, 30న పేపర్-2 ఉదయం 9.30 నుంచి12 గంటలవరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్-3పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 18వ తేదీన హాల్ టికెట్లు రిలీజ్ అవుతాయి. గ్రౌండ్ వాటర్ సర్వీసులో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలకు ఈ నెల 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించనుంది.


Tags:    

Similar News