Nara Lokesh : నేడు ఢిల్లీకి లోకేశ్

ఈరోజు రాత్రికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ వెళ్లనున్నారు.న. మంత్రి నారా లోకేష్ రేపు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు.

Update: 2025-08-17 04:51 GMT

ఈరోజు రాత్రికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ వెళ్లనున్నారు.న. మంత్రి నారా లోకేష్ రేపు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై లోకేష్ చర్చించనున్నారు. ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ లను ఆయన తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర మంత్రులతో...
రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన నిధులపై కేంద్ర మంత్రులతో నారా లోకేశ్ చర్చించనున్నారు. పార్టీ పార్లమెంటు సభ్యులతో కూడా సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముందని తెలిసింది. నారా లోకేశ్ తిరిగి మంగళవారం ఉదయం అమరావతికి చేరుకోనున్నారని ఆయన కార్యాలయం తెలిపింది.


Tags:    

Similar News