Nara Lokesh : నేడు నరేంద్ర మోదీతో నారా లోకేశ్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సమావేశం కానున్నారు

Update: 2025-09-05 01:57 GMT

ప్రధాని నరేంద్ర మోదీతో నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సమావేశం కానున్నారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే లోకేశ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో పాటు పెండింగ్ ప్రాజెక్టు, కేంద్ర పథకాల అమలుతో పాటు రాజకీయ పరిణామాలపై లోకేశ్ ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు గురించి ప్రధానికి వివరించే ఛాన్స్ ఉంది. ఇందులో వైసీపీ అధినేత జగన్ తో పాటు పలువురు నేతలు, మాజీ అధికారుల ప్రమేయం కూడా ఉందని చెప్పే అవకాశముంది.

కేంద్ర మంత్రులను కలసి...
దీంతో పాటు యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధాని మోదీకి నారా లోకేశ్ అందచేయనున్నారు. అనంతరం లోకేశ్ కేంద్ర మంత్రులతో చర్చించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పూర్తి కావాల్సిన ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. తిరిగి సాయంత్రానికి ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకుంటారు. గురుపూజోత్సవంలో పాల్గొంటారు. ఇప్పటికే లోకేశ్ కలిసేందుకు ప్రధాని అపాయింట్ మెంట్ పూర్తయింది. కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ను కూడా పార్లమెంటు సభ్యులు తీసుకున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News