Nara Lokesh : రెండో రోజు నారా లోకేష్ ఢిల్లీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రెండవ రోజు ఢిల్లీ లో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులను కలవనున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రెండవ రోజు ఢిల్లీ లో పర్యటిస్తున్నారు. నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన లోకేష్ నేడు మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా మంత్రి నారా లోకేష్ కలవనున్నారు.
కేంద్ర మంత్రులతో...
ఉదయం 12.45 కు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఆయన నివాసంలో నారా లోకేష్ కలవనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామిని ఆయన నివాసంలో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో చర్చిస్తారు.