Nara Loksh : ఢిల్లీ పర్యటనలో లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేశ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటనకు ఢిల్లీకి వచ్చిన మంత్రి లోకేశ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కేంద్రమంత్రులతో సమావేశమవుతారు. పార్టీ నేతలతో సమావేశమవుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనేందుకు నారా లోకేశ్ ఢిల్లీకి వచ్చినట్లు తెలిసింది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో సమావేశమవుతారు.
వరస భేటీలతో...
మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై లోకేశ్ చర్చించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, 5.30 గంటలకు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ తో సమావేశమవుతారు. రేపు ఉదయం కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో, సాయంత్రం బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ తో నారా లోకేష్ భేటీ కానున్నారు.