Nara Lokesh : ఢిల్లీలో లోకేశ్ బిజీబిజీ

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు.

Update: 2025-08-18 11:51 GMT

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్ర రైతాంగానికి ఎదురవుతున్న యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని లోకేశ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాతో జరిగిన మర్యాదపూర్వక భేటీలో లోకేశ్ ఈ విజ్ఞప్తి చేశారు.

యూరియా కొరత...
అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో యూరియా కొరత రైతులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన యూరియాను వెంటనే కేటాయించాలని లోకేశ్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి నడ్డా, ఈనెల 21వ తేదీ నాటికి రాష్ట్రానికి 29 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో రైతాంగంలో ఆందోళన తగ్గుతుందని భావిస్తున్నారు.


Tags:    

Similar News