ఈసారి కుప్పంలో గెలిస్తే చాలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2022-09-03 06:23 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 27 సంవత్సరాల క్రితం టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయ్యారని పండగ చేసుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. వెన్నుపోటు పొడిచిన రోజు పండగ చేసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. సెప్టంబరు 2వ తేదీ పేద ప్రజల పెన్నిధి వైఎస్ మరణించిన రోజని, ఆరోజు వైఎస్ ను ప్రజలు గుర్తు చేసుకుంటారని భావించి డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశమంటూ ఉదయం నుంచి రాత్రి వరకూ వైసీపీ మీద దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారన్నారు. రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారని, డిసెంబరు నాటికి లక్షల కోట్లు సొమ్ము డీపీటీ ద్వారా నేరుగా పేదల అకౌంట్ లోకి వెళ్లిందన్నారు.

డైవర్ట్ చేయడానికే....
ప్రభుత్వం మీద బురద చల్లేందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్నారు. అవినీతి పై కోర్టుల కెళ్లి స్టేలు తెచ్చుకున్నది ఎవరు అని జోగి రమేష్ ప్రశ్నించారు. సెప్టంబరు 1వ తేదీన అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా జరపాలని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరు ఏమి చేసినా వైెఎస్ ను ప్రజల గుండెల్లో నుంచి చెరపలేరన్నారు. చంద్రబాబు అమలు చేసిన ఒక్క పథకాన్ని గురించి చెప్పగలరా? అని జోగిరమేష్ నిలదీశారు. చంద్రబాబువి అన్నీ దింపుడు కళ్లెం ఆశలు అని ఆయన అన్నారు. పార్టీ ఏపీలో చచ్చిపోయిందని ఆయన మండి పడ్డారు. ఎన్ని జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నించినా కుదరదని అన్నారు. ప్రజలు చంద్రబాబును విశ్వాసంలోకి తీసుకోరని జోగి రమేష్ అన్నారు. కుప్పంలోనూ చంద్రబాబు ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.


Tags:    

Similar News