మంత్రి అవంతికి కరోనా
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప అస్వస్థత ఉండటంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వల్ప లక్షణాలే ఉన్నాయని, హోంఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందవచ్చని వైద్యులు సూచించారు.
తనతో కాంటాక్ట్ అయిన....
గత కొద్దిరోజులుగా అవంతి శ్రీనివాస్ విశాఖలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, కోవిడ్ నిబందనలను పాటించాలని అవంతి శ్రీనివాస్ కోరారు. సంక్రాంతి పండగను కూడా కోవిడ్ నిబంధనలతో జరుపుకోవాలని ఆయన కోరారు.