Andhra Pradesh : నేడు లా అండ్ ఆర్డర్ పై శాసనసభలో చర్చ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభం కానున్నాయి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి దీంతో శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాలకు సంబంధించిన దానిపై చర్చించనున్నారు.
సోషల్ మీడియా...
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. మహిళలు, ప్రభుత్వం పట్ల తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈరోజు జరిగే శాసనసభ సమావేశాల్లో చర్చించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.