ఏపీని ముంచెత్తుతున్న వానలు.. సూళ్లకు సెలవు

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి

Update: 2021-11-29 02:14 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమయింది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నాలుగు జిల్లాల్లో....
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ యా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది. దీంతో జిల్లా రెవెన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News