వైసీపీ నేతలకు హోంమంత్రి వార్నింగ్
వైసీపీ నేతలకు హోం మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు
వైసీపీ నేతలకు హోం మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ ప్రకారం తామె ముందుకెళ్తే వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరని అనిత హెచ్చరించారు.కూటమిలో అంతర్యుద్ధం అని కామెంట్స్ చేసిన గోరంట్ల మాధవ్ పై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదని, ఇది వైసీపీ ప్రభుత్వం కాని, ఎన్డీయే ప్రభుత్వం అని వార్నింగ్ ఇచ్చారు.
స్క్రిప్ట్ ఇచ్చినంత మాత్రాన...
ఎవరో స్క్రిప్ట్ ఇచ్చినంత మాత్రాన చదివితే ఫలితం అనుభవించాల్సింది పోసాని మాత్రమేనని వంగలపూడి అనిత అన్నారు. ఏది మాట్లాడితే అది మాట్లాడితే ఇలాగే ఉంటుందని అన్నారు. విధ్వేషాలు మాట్లాడే వారిని ఎవరినీ ఉపేక్షించేది లేదని వంగలపూడి అనిత అన్నారు. తప్పు చేసిన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.