పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

పదో తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఉచిత ప్రయాణం అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2025-03-07 11:56 GMT

పదో తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఉచిత ప్రయాణం అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. తాము బయలుదేరిన చోటు నుంచి పరీక్ష కేంద్రం వరకూ టెన్త్ విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణంచవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.

ఉచిత ప్రయాణం...
పదో తరగతి పరీక్షలకి హాజరయ్యే విద్యార్థులను కేవలం వారి హాల్ టికెట్ ఆధారంగా ఏ విధమైన బస్సు పాస్ లేకపోయినా కూడా పల్లె వెలుగు లేదా అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో ఉచిత ప్రయాణాన్ని అనుమతించాలని ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17వ తేదీ నుండి 31వ తేదీ వరకు పరీక్షలు ఉన్న రోజులలో మాత్రమే ఈ ఉచిత ప్రయాణం అనుమతించనున్నారు.


Tags:    

Similar News