Annadatha Sukhibhava Scheme : రైతులకు తీపికబురు.. ఈ నెల పదో తేదీ వరకూ ఆఖరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రైతులకు త్వరలో తీపికబురు చెప్పనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రైతులకు త్వరలో తీపికబురు చెప్పనుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాత-సుఖీభవ పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటి వరకూ అన్నదాత సుఖీ భవ పథకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదు. ఈ మేరకు బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కూడా కేటాయించారు. అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన సమయంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేడయడానికి సిద్ధమవతున్నారు. ఇప్పటికే ఈ పథకం కింద అర్హులైన రైతులను ఎంపిక చేసుకేందుకు కసరత్తు దాదాపుగా పూర్తయింది. మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
ఇప్పటికే గుర్తించని...
అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే వీరిలో దాదాపు ఎక్కువ శాతం మంది రైతుల ఈ-కేవైసీ పూర్తి అయిందని, మిగిలిన వారు కూడా ఈ కేవైసీని పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. పీఎం కిసాన్ తో కలిపి ఈ నిధులు జమ చేయనున్నారు. ఏడాదికి ఒక్కో రైతుకు ఇరవై వేలు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే మొత్తం మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేయనున్నారు. తొలి విడత నిధులు ఈ నెలలో జమ అవుతాయని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు.
పదో తేదీ వరకూ...
మరొక వైపు ఈ పథకం ప్రయోజనం పొందేందుకు గత నెల 30వ తేదీ వరకూ వెబ్ ల్యాండ్ లో నమోదయిన రైతుల భూమి ఖాతాలకు అర్హత కల్పించినట్లు అధికారులు తెలిపారు. అంటే వీరిందరికీ పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీ భవ పథకం నిధులు కూడా అందనున్నాయి. దీనికి సంబంధించిన ఫిర్యాదులను ఈ నెల పదో తేదీ వరకూ రైతుల ద్వారా రైతు కేంద్రాల వద్ద స్వీకరించనున్నారు. అందులో అర్హత ఉన్నవారందరికీ అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. కావున రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమకు అర్హత అందిందా? లేదా? అన్న విషయం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. తర్వాత కూడా అర్హత ఉన్న రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయడానికి అవసరమైన సమయాన్ని అందిస్తామని చెప్పారు.