అన్నదాత సుఖీభవ పథకం అమలు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాత-సుఖీభవ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జులై తొలి వారంలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
47.77 లక్షల మంది గుర్తింపు...
అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. లబ్ధిదారుల్లో 98 శాతం మంది రైతుల ఈ-కేవైసీ పూర్తి అయిందని, మిగిలిన వారు కూడా ఈ కేవైసీని పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. పీఎం కిసాన్ తో కలిపి ఈ నిధులు జమ చేయనున్నారు. ఏడాదికి ఒక్కో రైతుకు ఇరవై వేలు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే మొత్తం మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేయనున్నారు.