Annadatha Sukhibhava : రైతులకు నేడు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాల్లో ఏడు వేలు
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద నేడు ప్రభుత్వం నిధులను జమ చేయనునుంది. ఒక్కొక్క రైతు ఖాతాలో ఏడు వేల రూపాయల నగదును జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేల రూపాయలు, పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కలసి ఏడు వేల రూపాయలను జమ చేయనుంది. ఈ పథకం కింద రాష్ట్రంలో దాదాపు 46.85 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు.
మూడు విడతలుగా...
ఇందుకోసం ప్రభుత్వం 3,135 కోట్ల రూపాయల నగదును సిద్ధం చేసింది. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం కింద నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పీఎం కిసాన్ పథకం ఏటా మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతలగా ఈ నగదును జమ చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో విడత సాయంగా రైతుల ఖాతాల్లో నగదును నేడు జమ చేయనుంది.