Andhra Pradesh : నేడు ఏపీ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ను నేడు ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ను నేడు ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. 2025-26వ సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను నేడు ప్రవేశపెట్టనుంది. కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. దీంతో ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలకు ఎంత మేరకు కేటాయింపులు జరగనున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
పూర్తి స్థాయి బడ్జెట్ ను...
ఉదయం పది గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ శాఖ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో బడ్జెట్ ను కొల్లు రవీంద్ర ప్రవేశపెడతారు. అలాగే వ్యవసాయ శాఖ బడ్జెట్ ను శాసనమండలిలో మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టనున్నారు. దాదాపు మూడు లక్షన్నర కోట్లకుపైగా బడ్జెట్ అంచనాలు ఉండే అవకాశముంది.