Andhra Pradesh : మద్యం ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్రాండెడ్ మద్యంతో పాటుగా .99 రూపాయలకే కే క్వార్టర్ మద్యం అమ్మకాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందన వస్తుండటంతో మద్యం అమ్మకాలను పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది.
బార్ల పాలసీ...
ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ సెప్టెంబర్ లో బార్ల పాలసీ ప్రకటించనుంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలనే నిర్ణయానికి ఎక్సైజ్ శాఖ వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయం రాబట్టుకోవడంపై ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టడంలో భాగంగా పర్మిట్ రూములకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.