Andhra Pradesh : ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2025-09-18 06:56 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. తొలి దశలో నాలుగు మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు టండర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

నాలుగు మెడికల్ కళాశాలలో...
ఆంధ్రప్రదేశ్ లోని పులివెందుల,మదనపల్లె, మార్కాపురం, ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. టెండర్లను ఏపీఎంస్ఐడీసీ విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని విపక్షంచేస్తున్న ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడం పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.


Tags:    

Similar News