Aadhar Card : ఏపీలో ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలనుకుంటే ఇదే సమయం
ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పిస్తుంది
ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పిస్తుంది. చిన్న పిల్లలతో పాటు మార్పులు, చేర్పులు చేసుకోవడానికి చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను త్వరితగతిన ఆధార్ కార్డు నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ప్రతి పనికీ...
ప్రతి పనికీ ఆధార్ కార్డు ముఖ్యం కావడంతో తప్పనిసరిగా ఆధార్ కార్డును నమోదు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల పేర్లను ఆధార్ కార్డులో అప్ డేట్ చేయించుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం మీద 22 లక్షలు మంది పిల్లలు ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని, ఈ నెల 5వ తేదీ నుంచి 15 సం.లు పైబడిన పిల్లలు బయోమెట్రిక్ చేయించాలి. ఈనెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు.