Andhra Pradesh : ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాల్లోని గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తో పాటు సభ్యులను కూడా తొలగించాలని ఆదేశించింది.

Update: 2025-01-20 01:46 GMT

ఆంధ్రప్రదేశ్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తో పాటు సభ్యులను కూడా తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో నియామకం జరిగిన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, సభ్యుల పదవులను తొలగించాలని నిర్ణయించింది.

గత ప్రభుత్వం నియమించిన...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీని చేయనున్నారు. మూడో విడత జాబితాలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తో పాటు సభ్యులను కూడా నియమించనుండటంతో ముందుగానే వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఈ నియామకాలను జరిపేందుకు కూటమి సర్కార్ కసరత్తులు చేస్తుంది.


Tags:    

Similar News