Andhra Pradesh : కొత్త జిల్లాలపై కసరత్తు షురూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలపై కసరత్తు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలపై కసరత్తు చేస్తుంది. గత ప్రభుత్వం అనుసరించిన విధానంతో జిల్లాల ఏర్పాటులో గందరగోళం ఏర్పడిందన్న ఫిర్యాదులందాయి. సమీపంలో ఉన్న ప్రాంతాలను కూడా వేరే జిల్లాకు దూరంగా ప్రకటించడంతో జిల్లా కేంద్ర కార్యాలయానికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇందుకోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది.
మంత్రివర్గ ఉప సంఘంలోని...
మంత్రి వర్గ ఉప సంఘంలోని సభ్యులు జిల్లాలను పర్యటించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి నివేదికను అందించినట్లు తెలిసింది. జిల్లా కేంద్రాల ఏర్పాటులో గందరగోళాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మంత్రివర్గ ఉప సంఘం ఇన్చిన నివేదికను కూడా పరిశీలించి, ప్రజల నుంచి వినతుల స్వీకరించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ముందే చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.