Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. పేరున్న కంపెనీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. పేరున్న కంపెనీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం పలు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా రూపొందించిన పారిశ్రామిక విధానాల నేపథ్యంలో, సిర్మా స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటుకు అంతా సిద్ధమయింది. దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనుంది. నాయుడుపేటలోని మేనకూరు గ్రామంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కోరడంతోదీనిని అక్కడ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి ఆధునిక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో మరో గుర్తింపు లభించనుందని పరిశ్రమ వర్గాలు వెల్లడంచాయి.