మరో రెండు వేల కోట్ల అప్పుకు ఏపీ సర్కార్ సిద్ధం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండువేల కోట్ల రూపాయల రుణాన్నిసమీకరించేందుకు సిద్ధమయింది.

Update: 2025-06-28 12:57 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండువేల కోట్ల రూపాయల రుణాన్నిసమీకరించేందుకు సిద్ధమయింది. కూటమి ప్రభుత్వం మంగళవారం మరో రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేయనుంది.ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ నుంచి పథ్నాలుగు వేల కోట్ల రూపాయలను రుణం కింద కూటమి ప్రభుత్వం సేకరించింది. తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయలను సేకరించేందుకు రెడీ అవుతుంది.

ఇప్పటి వరకూ...
ఏపీఎండీసీ బాండ్ల ద్వారా 5,526 కోట్ల రూపాయలను అప్పు సమీకరించింది. వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకోనున్న 2000 కోట్ల రూపాయల అప్పుతో కలిపి ఏడాది పాలనలో 1.68 లక్షల కోట్ల రూపాయల అప్పును కూటమి ప్రభుత్వం చేసింది. అప్పు చేసిన మొత్తంతో సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


Tags:    

Similar News