Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తసీుకుంది. రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయింది

Update: 2025-06-01 04:16 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తసీుకుంది. రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ఐటీ శాఖ జారీ చేసింది. 2026 జనవరి ఒకటో తేదీ నాటికి క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్‌ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పార్క్ నిర్మాణానికి మూడు ప్రముఖ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

నైపుణ్యం అందించేందుకు...
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సెన్ అండ్ టూబ్రో, ఐబీఎం సంస్థలు ఈ పార్క్‌ను నిర్మిస్తున్నాయి. ఐబీఎం సంస్థ 156 క్యూబిక్ క్వాంటమ్ సిస్టం – 2 ను ఏర్పాటు చేయనుంది. టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ సేవతో పాటు క్వాంటంపై పరిశోధన, హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్‌ను అందించనుంది. ఎల్ అండ్ టీ క్లయింట్ నెట్‌వర్క్, స్టార్టప్‌ల నిర్వహణకు అవసరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని అందించనుంది.


Tags:    

Similar News