ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది

Update: 2022-02-14 12:20 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ జాగ్రత్తలు మాత్రం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఫీవర్ సర్వేను కూడా కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

కేసులు తగ్గుముఖం....
ఈరోజు ఐదు వందలకు దిగువన కేసులు నమోదయ్యాయి. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో నైట్ కర్ఫ్యూను ఎత్తివేశారు. దాదాపు నెల రోజుల నుంచి నైట్ కర్ఫ్యూ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగింది. అలాగే ఆరోగ్య శాఖలో రిక్రూట్ మెంట్ ను కంటిన్యూ చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.


Tags:    

Similar News