కరోనా ఆంక్షలను కఠినతరం చేసిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరనా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2022-01-11 08:16 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరనా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే నైట్ కర్ఫ్యూను విధించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ నైట్ కర్ఫ్యూను విధించారు. జనవరి 31వ తేదీ వరకూ నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే నైట్ కర్ఫ్యూ సమయంలో అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయించింది.

సంక్రాంతి పండగకు....
బహిరంగ ప్రదేశాల్లో రెండు వందలకు మించి అనుమతివ్వరు. వివాహ కార్యక్రమాలకు వంద మందికి మాత్రమే అనుమతిస్తారు. సంక్రాంతి పండగ కోసం అంతరాష్ట్ర రవాణాకు ప్రభుత్వం అనుమతించింది. సంక్రాంతి వరకూ ఈ వెసులుబాటు కల్పించింది. సినిమా థియేటర్లలో యాభై శాతానికి మాత్రమే ఆక్యుపెన్సీకి అనుమతిచ్చింది.


Tags:    

Similar News