Andhra Pradesh : దసరాకు పదిహేను వేలు దక్కనున్న ఆటో డ్రైవర్ల ఫైనల్ జాబితా ఇదే

ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేను వేలు ఇచ్చేందుకు అర్హుల జాబితా సిద్దమయింది.

Update: 2025-09-26 06:55 GMT

ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేను వేలు ఇచ్చేందుకు అర్హుల జాబితా సిద్దమయింది. ఈ పథకం కోసం మొత్తం 3,10,385 మందిని అర్హులుగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ 15 వేలు జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న వీరి ఖాతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నిధులు జమ చేస్తారు. అంటే దసరా పండగ రోజున వాహనమిత్ర పధకం కింద పదిహేను వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే కూడా విడుదలయ్యాయి.

మార్గదర్శకాల మేరకు...
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ఉన్న ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లు ఈ పధకం కింద తమను అర్హులుగా చేర్చాలంటూ దరఖాస్తు చేశారు. పూర్తి చేసిన దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయంలో సమర్పించారు. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు తమకు అందిన దరఖాస్తులను అధికారులు వడపోశారు. నిబంధనల ప్రకారం, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి లబ్దిదారుల ఎంపిక చేసినట్లు తెలిసింది. రాష్ట్రం మొత్తం మీద 3.10 లక్షల మంది ఆటో, మ్యాక్స్, క్యాబ్ డ్రైవర్లు వాహనమివత్ర పథకం కింద ఎంపిక చేశారు. అన్నీ సక్రమంగా ఉండి, ఎలాంటి చలాన్లు పెండింగ్ లో ఉన్నా ఈ పథకం వర్తించని వారిని ప్రభుత్వం ఎంపిక చేసింది.
నిబంధనలకు లోబడి...
పొల్యూషన్ తో పాటు ఫిట్ నెస్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి చేసింది. ఆటో, క్యాబ్ డ్రైవర్ ల డ్రైవింగ్ లైసెన్సును కూడా పరిశీలించింది. దీంతో పాటు లబ్దిదారుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలి. రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. నెలకు మూడు వందల యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించాలి. తెలుపు రంగు రేషన్ కార్డులుండాలి. అలాగే నివాస, వ్యవసాయ భూమిపై కూడా పరిమితులను పెట్టింది. అన్ని నిబంధనలను సక్రమంగా ఉంటేనే వాహన మిత్ర పథకానికి ఎంపికవుతారు. అందిన దరఖాస్తుల్లో నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి ఆ జాబితాను తిరిగి వార్డు, గ్రామ, పట్టణ సచివాలయాలకు పంపనుంది. ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News