Andhra Pradesh : ప్రకాశం జిల్లా నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు
రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది
రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్ సిక్స్ లో మరో హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 2న ప్రకాశం జిల్లా సభలో 'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల చేయనున్నారు. అదేరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 'అన్నదాత సుఖీభవ' నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనున్ననట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించి ఈ నిధులను విడుదల చేయనున్నారు.
ఒక్కొక్కరి ఖాతాలో ఏడు వేలు...
అదే రోజు ఒక్కొ్క్కరి ఖాతాలో రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో చేయనుంది. అదే రోజు ఏపీలో 'అన్నదాత సుఖీభవ' పథకం నిధులు విడుదల చేయనుంది. ఒక్కొక్క రైతు ఖాతాలో ఐదువేల రూపాయలు ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. ఏపీలో సుమారు 47 లక్షల మంది రైతులకు ఈ నిధులు జమకానున్నాయి. అన్నదాత సుఖీభవ' కు 2,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనుంది.