ఏపీలో దసరా సెలవులు.. విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. దసరా సెలవులను ప్రకటించింది.
dussehra holidays
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
పది రోజుల పాటు...
అక్టోబరు నెలలో 13 వరకు దసరా సెలవులు ఉంటాయని నారా లోకేష్ తెలిపారు. పాఠశాల విద్యపై ఆయన సమీక్షించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని, 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు.