Andhra Pradesh : పేదలకు భారీ బహుమతి.. దసరా నాటికి నెరవేరనున్న కల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండగకు భారీ బహుమతి ఇచ్చేందుకు సిద్ధమయింది. మూడు లక్షల ఇళ్ల లో గృహప్రవేశాలు చేయాలని నిర్ణయించింది.

Update: 2025-08-28 04:32 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండగకు భారీ బహుమతి ఇచ్చేందుకు సిద్ధమయింది. మూడు లక్షల ఇళ్ల లో గృహప్రవేశాలు చేయాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించింది. ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కాలం పూర్తి కావడంతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ఆదరిభామానాలను చూరగొనే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ దసరా పండగ నాడు మూడు లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

ఈ ఏడాది ఐదు లక్షల మందికి...
దసరాకు మూడు లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయించడంతో పాటు రానున్న సంక్రాంతి నాటికి మరో రెండు లక్షల ఇళ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. అంటే ఈ ఏడాది దాదాపు ఐదు లక్షల మంది ఇళ్లులేని పేదలకు సొంత ఇంటి కల సాకారమవుతుందని భావిస్తున్నారు. సొంత ఇంటికోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న పేదలకు ప్రభుత్వం తీపికబురు అందించినట్లయింది. వేగంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పది లక్షల మందికి సొంత ఇళ్లను సమకూర్చాలన్న ఉద్దేశ్యంలో ప్రభుత్వం ఉంది.
ఆరు లక్షల మందికి ఇచ్చేలా...
ఇందుకు అనుగుణంగా కేటగిరీలుగా విభజించి వాటిని పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో జరిపిన సర్వే ప్రకారం ఇప్పటి వరకూ ఆరు లక్షల మందికి సొంత ఇళ్లు కావాలని తేలింది. దీంతో వచ్చే ఏడాదికి ఆరు లక్షల మందికి సొంత ఇళ్లను అందించేలా ప్రణాళికలను రూపొందించారు. ఈ మేరకు అధికారులు పనులను ముమ్మరంపూర్తి చేశారు. ఇప్పటికే అనేక గృహాలు నిర్మాణానికి తుది దశకు చేరుకున్నాయి. మరికొన్నింటిలో చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి దసరా నాటికి పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అదే సమయంలో నిధులకు సంబంధించిన ఇబ్బందులు కూడా లేకపోవడంతో గృహ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
Tags:    

Similar News