Andhra Pradesh : ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. దసరా సెలవుల్లో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-09-23 03:27 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డులు అప్ డేట్ చేసుకునేందుకు, నమోదు చేసుకునేందుకు అవసరమైన ఆధార్ ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసింది. దసరా సెలవులు కావడంతో అందరూ ఇంటిపట్టునే ఉంటారు. ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు, మార్పులు చేసుకునేందుకు వీలుంటుందని భావించి ప్రభుత్వం ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసింది.

ఆధార్ ప్రత్యేక కేంద్రాలు...
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి 26వ తేదీ వరకు ఏపీలో ఆధార్ స్పెషల్ క్యాంప్‍లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. - దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు, సవరణకు ఏపీ వ్యాప్తంగా ఆధార్ ప్రత్యేక క్యాంప్‍ లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు పండగకు సొంతూళ్లకు వచ్చిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.


Tags:    

Similar News