Andhra Pradesh : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. బటన్ నొక్కగానే హాల్ టిక్కెట్
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్ లో అందించనుంది
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్ లో అందించనుంది. వాట్సప్ గవర్నెన్స్‌లో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు వాట్సప్ ద్వారా నేటి నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కాలేజీలు హాల్‌టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి జరగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మార్చి 3 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.
వాట్సప్ ద్వారానే...
ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం 161 సేవలను అందిస్తోంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వాట్సప్ నంబరు 9552300009 ద్వారా వారంతా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో పదో తరగతి విద్యార్థులకూ ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్‌కి హాయ్ అనే వాట్సప్‌లో మెసేజ్ చేయగానే, సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి. అందులో విద్య సేవలుపై క్లిక్ చేయాలి. అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్పై క్లిక్ చేయగానే, ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్లోనే ఎంతో సింపుల్‌గా డౌన్‌లోడ్ అవుతుంది.