Annadatha Sukhibhava Scheme : రైతులకు గుడ్ న్యూస్... రైతుల ఖాతాల్లో నగదు జమ ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-07-28 04:27 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో వారం రోజుల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయనుంది. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఒకొక్క రైతు ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ కానున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా ఐదు వేల రూపాయలు జమ చేయనునట్లు అధికారులు తెలిపారు. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో...
ఖరీఫ్ సీజన్ ప్రారంభయినా ఇంకా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకపోవడంపై రైతులు ఒకింత అసంతృప్తిగా ఉన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయినా తమకు విత్తనాల కొనుగోలుకు, యూరియా, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకు అవసరమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకపోవడంపై ఇబ్బందులు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పీఎం కిసాన్ పథకం నిదులతో కలిపి విడుదల చేయాలని నిర్ణయించడంతో ఇంత ఆలస్యమయిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం అర్హులైన అన్నదాతలందరికీ వర్తిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవకు సంబంధించిన నిధులను సిద్ధం చేసినట్లు తెలసింది.
ఏడాదికి మూడు విడతలుగా...
అన్నదాత సుఖీభవ పథకం కింద పీఎం కిసాన్ పథకం తరహాలోనే ఏడాదికి మూడు విడతలుగా జమ చేస్తామని చంద్రబాబు తరచూ చెబుతున్నారు. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేరెండువేలు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు నిధులు ఇచ్చిమొత్తం ఏడువేల రూపాయలు జమచేయాలని భావిస్తుంది. వ్యవసాయ శాఖ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన లబ్దిదారులను గుర్తించింది. కౌలు రైతులకుకూడా ఈ పథకంవర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. అయితే ఆగస్టు 2వ తేదీన అర్హులైన అందరికీ, పీఎం కిసాన్ పథకం వర్తించే వారందరితో పాటు కౌలు రైతులకు కూడా డబ్బులు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత తొలిసారి అన్నదాతలకు ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింప చేయనుంది.



Tags:    

Similar News