ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఏడాదికి పదివేలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-07-29 02:35 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదికి పదివేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమమయిందని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర ఆటో డ్రైవర్లకు ఏడాదికి పది వేల రూపాయలు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

త్వరలోనే నిర్ణయం...
దీనిపై త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని కూడా మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు తొలి విడతగా రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ చేస్తామని కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని, మూడు విడతలగా చెల్లిస్తామని తెలిపారు. ఆటోడ్రైవర్ల పథకం ఎప్పుడిస్తామన్నది త్వరలోనే తేదీని ప్రకటిస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు.


Tags:    

Similar News