అన్ ఎయిడెడ్ పాఠశాలల కు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల గుర్తింపు గడువును ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Update: 2025-05-30 05:12 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల గుర్తింపు గడువును ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఎనిమిదేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బాలల విద్యాహక్కు నిర్బంధ విద్యా నిబంధనల్ని సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గడువును పెంచుతూ...
ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలకు జారీ చేసే గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు నిబంధనల్ని సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో అన్ యిడెడ్ పాఠశాలల యాజమాన్యాలకు భారీ ఊరట దక్కినట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నయాి.


Tags:    

Similar News