బ్యాడ్ లక్ .. ఏపీలో పింఛన్లను తొలగించిన ప్రభుత్వం

ఏపీలో 18,036 మంది పింఛన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిగించింది

Update: 2025-02-02 04:44 GMT

ఏపీలో 18,036 మంది పింఛన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిగించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ల నిన్నటి నుంచి పంపిణీజరుగుతుంది. ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లను ఇంటి వద్దకే ఇస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులకు నెలకు నాలుగువేల రూపాయలు, దివ్యాంగులకు ఆరువేల రూపాయలు నెలకు పింఛన్లు ఇస్తుంది.

దివ్యాంగులలో ఎక్కువ మంది...
అయితే ఇదే సమయంలో పింఛన్లు అందుకుంటున్న వారిలో అనర్హులున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఇటీవల ఏపీ వ్యాప్తంగా సర్వేను కూడా నిర్వహించింది. అందులో భాగంగా దివ్యాంగ పింఛన్లు అనర్హులను ప్రభుత్వం తొలగించడంతో జనవరిలో 63,77,943 మంది పింఛన్ లబ్దిదారులు ఉండగా ఫిబ్రవరిలో 63,59,907కు తగ్గింది. దీంతో పింఛన్ల జాబితా నుంచి తొలగించిన 18,036 మంది ఇకపై పింఛన్ పొందలేరని తెలిసింది. అయితే అనర్హులు ఏయే జిల్లాల్లో ఉన్నారనేది తేల్చాల్సి ఉంది.


Tags:    

Similar News