వారికి గుడ్ న్యూస్.. బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వ నిలిపేసిన బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది

Update: 2025-06-19 02:06 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వ నిలిపేసిన బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం కక్ష పూరితంగా ఉపాధి హామీ పథకంలో నిలిపివేసిన వంద కోట్ల పెండింగ్‌ బిల్లులను కూటమి ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధమయింది. పనులు చేసిన వెండర్ల బ్యాంకు ఖాతాలకు వారం రోజుల్లో నిధులు జమ కానున్నాయి. మూడు రోజుల క్రితమే ఇందుకు సంబంధించిన ప్రక్రియప్రారంభమయింది.

అప్పటి ప్రభుత్వం...
2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులతో చేపట్టిన పనుల్లో కొన్నింటికి బిల్లుల చెల్లింపులను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పనులు చేయించిన వారిలో కొందరు అప్పులపాలయ్యారు. కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కూటమి ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలించాక పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాల కింద ఇటీవల విడుదల చేసిన రూ.1,280 కోట్ల నుంచి రూ.100 కోట్ల రూపాయలను చెల్లించేందుకు సిద్ధమయింది.


Tags:    

Similar News