Andhra Pradesh : మద్యం ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-01-14 02:59 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైన్ షాపుల్లో కొనుగోలు చేసే వారికి, బార్ లో కొనుగోలు చేసే వారికి ఇక ఒకేరకమైన ధరల్లో మద్యం లభించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీలో కొన్ని మార్పులు చేసింది. బార్ అండ్ రెస్టారెంట్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఇక వైన్ షాపులో నయినా, బార్ లో అయినా ఒకే రకమైన ధరకు మద్యం లభించనుంది.

ఒకే ధర...
దీని వల్ల బార్ లలో కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరగనుంది. ఇప్పటి వరకూ బార్ లకు రావాలంటేనే ధరను చూసి భయపడిపోతున్నారు. మరొకవైపు వైన్ షాపులకు అనుగుణంగా సిట్టింగ్ ఏరియాలకు కూడా అనుమతించడంతో బార్ల యజమానులు గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బార్లు, వైన్ షాపుల్లో ఒకే ధర లభించనుండటంతో ఇక బార్లు కూడా వినియోగదారులతో కళకళలాడనున్నాయి.


Tags:    

Similar News