కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతి
కృష్ణా, గోదావరి వరద ఉధృతి కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
కృష్ణా, గోదావరి వరద ఉధృతి కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.8 అడుగుల నీటిమట్టానికి చేరుకుందని, కూనవరం వద్ద నీటిమట్టం 18.10 మీటర్లు, పోలవరం వద్ద 11.71 మీటర్లు, ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 7.99లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈరోజు మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని సహాయక చర్యలకు ఆరు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుంటాయని తెలిపింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు...
మరొకవైపు నిలకడగా కృష్ణానది వరద ప్రవాహం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2.98 లక్షల క్యూసెక్కలుగా ఉందని చెప్పింది. అయితే ప్రజలు వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలికృష్ణా,గోదావరి నదిపరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది.