Andhra Pradesh : పిడుగులు పడతాయ్.. ఇంట్లోనే ఉండండి
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఆరెంజ్.. ఎల్లో అలెర్ట్...
అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి పిడుగులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. ఈ జిల్లాలకు అరెంజ్ అలెర్ట్ ను జారీ చేశార. ఇక పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి పిడుగులుతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బలమైన గాలులు వీచే అవకాశముందని, చెట్ల కింద ఉండవద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.