తగ్గుతున్న వరద .. అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే
గోదావరి, కృష్ణా నదులలో వరద ప్రవాహం తగ్గు ముఖం పట్టినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది
గోదావరి, కృష్ణా నదులలో వరద ప్రవాహం తగ్గు ముఖం పట్టినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 39.5అడుగుల నీటిమట్టంగా ఉందని అధికారులు తెలిపారు. కూనవరం వద్ద నీటిమట్టం 18.99 మీటర్లు, పోలవరం వద్ద 12.65 మీటర్లు, ధవళేశ్వరం వద్ద ఇన్&అవుట్ ఫ్లో 12.34 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
అన్ని బ్యారేజీల వద్ద...
కృష్ణా నది వర ద ప్రవాహం కూడా కొంత తగ్గినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 4.73, ఔట్ ఫ్లో 5.14 లక్షల క్యూసెక్కులుగానూ, నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4.45, ఔట్ ఫ్లో 4.05లక్షల క్యూసెక్కులుగానూ, పులిచింతల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.91 లక్షల క్యూసెక్కులుగా,ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కలుగా ఉందని, మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినట్లు తెలిపారు. వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.