Pawan Kalyan : నేడు మార్కాపురానికి పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ నరసింహాపురం తాగునీటి పథకానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. 1,290 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ పథకానికి పవన్ కల్యాణ్ అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
అతి పెద్ద తాగునీటి పథకానికి...
మార్కాపురం నియోజకవర్గం ప్రాంతంలో అతి పెద్ద తాగునీటి పథకానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయడానికి వస్తుండటంతో పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కాపురం చేరుకోనున్నారు. పవన్ పర్యటనకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.