Pawan Kalyan : ఈనెల 24న పిఠాపురానికి పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 24 వతేదీన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 24 వతేదీన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. ప్రభుత్వ భవనాలను ప్రారంభిస్తారని వెల్లడిచంారు.
పలు భవనాలకు...
పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. గొల్లప్రోలులో తహసీల్దారు కార్యాలయ భవనం, యూపీహెచ్ సీ భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. కేవలం అధికారిక కార్యక్రమాలకు మాత్రమే కాకుండా పిఠాపురం జనసేన నేతలతో కూడా పవన్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి.