Pawan Kalyan : నేడు గుంటూరు జిల్లాకు పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. స్వచ్ఛ్ ఏపీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పెదకాకాని మండలం నంబూరులో ఆయన స్వచ్ఛ్ ఏపీ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పవన్ పర్యటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశముందని భావించి అందుకు తగిన భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
నేతలు, అభిమానులు...
అదే సమయంలో గుంటూరు జిల్లా జనసేన నేతలు కూడా పెద్ద సంఖ్యలో నంబూరుకు తరలి వస్తున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నంబూరు వస్తున్నారని తెలిసి నేతలతో పాటు అభిమానులు కూడా తరలివస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు చేశారు. గంటసేపు అక్కడే పవన్ కల్యాణ్ ఉండనున్నారని అధికారులు తెలిపారు.