Pawan Kalyan : నేడు చెన్నైకు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు చెన్నై వెళ్లనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు చెన్నై వెళ్లనున్నారు. నిన్న ఢిల్లీలో ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశాలో పాల్గొన్న పవన్ కల్యాణ్ నేరుగా ఢిల్లీ నుంచి చెన్నైకు చేరుకున్నారు. ఈరోజు చెన్నైలో ఉదయం పది గంటలకు తిరువాన్మియూర్ రామచంద్ర కన్వెన్షన్ సెంటర్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ సదస్సులో...
ఈ కన్వెన్షన్ సెంటర్ లో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ వల్ల దేశంతో పాటు ప్రభుత్వాలకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వివరించనున్నారు. అనంతరం ఆయన అమరావతికి బయలుదేరి వస్తారు.