Pawan Kalyan : నేడు బెంగళూరుకు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఏనుగుల తాకిడితో పంట పొలాలు ధ్వంసమవుతుతున్నాయి. అనేక మంది మృత్యువాత కూడా పడుతున్నారు. ప్రధానంగా చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏనుగుల బెడదతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పవన్ కల్యాణ్ కొంత కాలం క్రితం కర్ణాటక వెళ్లి అక్కడ నేతలతో చర్చించి కుంకీ ఏనుగులను కొన్నింటిని తమకు అప్పగించాలని కోరారు.
కుంకీ ఏనుగులు...
కుంకీ ఏనుగులు ఉంటే అడవిలో ఉండే ఏనుగులు పంటపొలాలపైకి రావన్న ఉద్దేశ్యంతో కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయి. నేడు బెంగళూరు వెళ్లి పవన్ కల్యాణ్ కుంకీ ఏనుగులను ఏపీకి తెప్పించనున్నారు. శిక్షణ పొందిన కుంకీ ఏనుగునలు ఈరోజు కర్ణాటక ప్రభుత్వం నుంచి అధికారికంగా తీసుకు రానున్నారు. నేడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లతో పవన్ కల్యాణ్ భేటీ అయి కుంకీ ఏనుగులను ఏపీకి తెచ్చేందుకు బెంగళూరు బయలుదేరి వెళుతున్నారు.