Pawan Kalyan : నేటి నుంచి పవన్ పుణ్యక్షేత్రాల దర్శనం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి దక్షిణ భారత దేశంలోని పుణ్య క్షేత్రాలను దర్శించనున్నారు

Update: 2025-02-12 01:56 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి దక్షిణ భారత దేశంలోని పుణ్య క్షేత్రాలను దర్శించనున్నారు. హైందవ పరిరక్షణ ధర్మం కోసంాయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు, కేరళ లోని ప్రముఖ ఆలయాలన్నింటినీ నేటి నుంచి వరసగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కేరళ రాష్ట్రంలోని కొచ్చికి చేరుకుంటారు.

కేరళ, తమిళనాడులోని....
జ్వరం నుంచి కోలుకున్న తర్వాత ఆయన నేరుగా ఈ యాత్రను చేపడుతుండటం విశేషం. మూడు రోజుల పాటు దక్షిణాదిలోని ఆలయాలను సందర్శిసత్ారు. గతంలో ఆయన మొక్కులు కూడా తీర్చుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడంచాయి. అనంత పద్మనాభ స్వామి దేవాలయం, మధుర మీనాక్షి దేవాలయం, పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలైయ్, తిరుత్తై సుబ్రహ్యణ్యేశ్వరస్వామి ఆలయాలను సందర్శిస్తారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన ఈ ఆలయాలను సందర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News